HomeతెలంగాణMulugu :ములుగు’లో బీఆర్ఎస్​కు ఎదురులేదు

Mulugu :ములుగు’లో బీఆర్ఎస్​కు ఎదురులేదు

– వచ్చే ఎన్నికల్లో వార్​ వన్ సైడ్​
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

ఇదేనిజం, హైదరాబాద్​: ములుగు సెగ్మెంట్​లో బీఆర్ఎస్​ పార్టీకి ఎదురులేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. బడే నాగజ్యోతి ఎమ్మెల్యేగా విజయం సాధించి తీరుతారని అన్నారు. ములుగులోని లీలా గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్‌ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. దయాకర్‌రావుతోపాటు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీ ప్రకాశ్‌, రెడ్కో చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. దయాకర్‌రావు మాట్లాడుతూ పేదల కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర నాగజ్యోతి కుటుంబానిదన్నారు. అందుకే గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆమెకు టిక్కెట్‌ కేటాయిస్తున్నారని అన్నారు. సర్వేలన్నీ అనుకూలంగా వచ్చాయని, నాగజ్యోతి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ములుగు టిక్కెట్‌ను చాలామంది ఆశించారని, వారందరికీ అధిష్ఠానం న్యాయం చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ చొరవతోనే అజ్మీరా చందూలాల్‌ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో మంత్రి కాగలిగారన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం అమెరికా నుంచి డాక్టర్లను రప్పించారని గుర్తు చేశారు. చందూలాల్‌ కుటుంబంపై పార్టీకి అభిమానం ఉందన్నారు. పార్టీకి వారు ద్రోహం చేయొద్దని అన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img