IPL : ఐపీఎల్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ..ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ఓడించింది. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పతిరణ నాలుగు వికెట్లతో విజృంభించాడు. ఛేదనలో రోహిత్ శర్మ 63 బంతుల్లో 105 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో.. హర్డిక్ బౌలింగ్‌లో ధోనీ చివరి 4 బంతుల్లో 3 సిక్సులు బాది 20 పరుగులు రాబట్టాడు.