Homeహైదరాబాద్latest NewsKamareddy : జిల్లా కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్

Kamareddy : జిల్లా కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్

ఇదేనిజం, కామారెడ్డి : మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ జిల్లా కలెక్టర్ ను కలిశారు. రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు, దోమల నివారణకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నుంచి చేపట్ట వలసిన చర్యలు, జిల్లా అధికార యంత్రాంగం నుంచి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించారు. కామారెడ్డి మున్సిపాలిటీ సమస్యలు, వీధి దీపాలు గురించి, పార్కు అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. వీటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారుచేస్తానని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రికి అందించే నివేదిక లో కామారెడ్డి అంశాలను జతపర్చారు. కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, పాత శివ కృష్ణ మూర్తి, చాట్ల వంశీ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img