Homeజిల్లా వార్తలుచిన్నారిపై పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని 'జీవదాన్' ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా..!

చిన్నారిపై పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని ‘జీవదాన్’ ఎదుట మున్సిపల్ చైర్ పర్సన్ ధర్నా..!

  • కామారెడ్డిలో ఉద్రిక్తత.. సీఐ చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు

ఇదేనిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఆరేళ్ల చిన్నారితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించిన విషయం వెలుగుచూడడంతో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియతోపాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకొని ధర్నా నిర్వహించారు. చిన్నారులకు భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఎదుట బైటాయించిన చైర్ పర్సన్ డీఈవోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు. స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని స్పష్టం చేశారు.

చైర్ పర్సన్ స్కూల్ ఎదుట బైటాయించడంతో నాయకులు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పిల్లలను మధ్యలో నుంచే స్కూల్ నుంచి పంపించేశారు. పట్టణ సీ ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు. జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యూకేజీ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన పీఈటీ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని చేపట్టిన ఆందోళనలో పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళన కారులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజ రామ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img