Homeహైదరాబాద్latest Newsఘనంగా వన మహోత్సవం.. వన మహోత్సవం మొక్కలను సురక్షించాలన్న మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య

ఘనంగా వన మహోత్సవం.. వన మహోత్సవం మొక్కలను సురక్షించాలన్న మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య

ఇదేనిజం, లక్షెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 11వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని అయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. చెట్ల పెంపకం ద్వారా మానవ మనుగడ సాధ్యమౌతుందన్నారు. ప్రకృతి పరిణామ క్రమం సక్రమంగా ఉండేందుకు చెట్లు దోహదం చేస్తాయన్నారు. అందుకే మన పూర్వికులు చెట్లను దేవతలుగా పూజించారన్నారు. అనంతరం 11వ వార్డులోని మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, కో ఆప్షన్స్ సభ్యులు నూనె ప్రవీణ్, వార్డు అధ్యక్షుడు ముత్తె తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, ఈఈ కట్ల రాకేష్, వార్డు ఆఫీసర్ శ్రీదేవి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img