హైదరాబాద్, ఇదే నిజం : రౌడీషీటర్ దారుణహత్యకు గురైన సంఘటన హైదరాబాద్ కమిషనరెట్ సౌత్జోన్ రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో జరిగింది. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం యాకుత్పురా నియోజకవర్గం మౌలక ఛిల్ల బస్తీలో నివసించే మహ్మద్ ఆయాజ్ ఉద్దీన్ ఆలీయాస్ కండా ఆయాజ్ 35, ఇతడు రెండు హత్యకేసులో ప్రధాన ముద్దాయి. అయితే శనివారం యాకుత్పురా బడాబజార్ చంద్రనగర్ బస్తీలోని ఒక చాయి దుకాణం వద్ద ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై మారణాయుదాలు, కత్తులతో దాడి చేసి అతికీరాతకంగా పోడవడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మీర్చౌక్ ఏసీపీ బి.ఆనంద్, ఇతర పోలీసులు, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ అనంతరం మృతదేహన్ని మరణోత్తర పరిక్షల నిమిత్తం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మర్డర్ వేనుక పాత కక్షలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.