Homeసినిమాకీరవాణికి అరుదైన రోగమంటా...

కీరవాణికి అరుదైన రోగమంటా…

హైదరాబాద్​: ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​ ఎంఎం కీరవాణి ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా పనుల్లో మళ్లీ స్టార్ట్‌ చేస్తున్నట్టు కీరవాణి తాజాగా ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతోపాటు క్రిష్‌, రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో రెండు సినిమాలకు పనిచేయబోతున్నట్టు ఆయన తెలిపారు. ఇంతలోనే కీరవాణికి మరో అరుదైన వ్యాధి సోకిందని సోషల్​ మీడియాలో పోస్టులు వైరల్​ అవుతున్నాయి. కానీ వాస్తవం మరోలా ఉంది. దీనిపై స్వయంగా కీరవాణి ట్విటర్​లో వీడియో పెట్టారు.
‘‘మల్టీపుల్ స్క్లెరోసిస్ (ఎంఎస్‌) వ్యాధి గురించి ఇటీవలే తాను తెలుసుకున్నానని.. ఈ వ్యాధి ఏ వయసులోని వారికైనా వస్తుందని, ఈ వ్యాధి కారణంగా మెదడు- శరీరం మధ్య సమన్వయం తగ్గుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధిపై మల్టిపుల్ స్క్లెరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా సమాజంలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో గొప్ప ధైర్యం నింపి.. యోగా, సంగీతం వంటి సాధనాలతో వారు కోలుకుంటారన్న ఆశ కల్పించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేయాలి.”అని ఆ వీడియోలో కీరవాణి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img