ఇదే నిజం, ముస్తాబాద్ (Mustabad) మండలంలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. కొండాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ రషీద్ 45 సం భార్య కూతురు కుమారుడు కలరు ఆదివారం అర్ధరాత్రి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతై ఉదయం నుండి గజ ఈత గల సహాయక చర్యలు చేపట్టడంతో మధ్యాహ్నం చెరువులో రషీద్ మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు బోరుణ విలపించారు. ఈ ఘటన చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.