- బోనాల పండుగ నిర్వహణకు సుమారు రూ. 1,50,000 లు వితరణ చేస్తున్న గూడూరు మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్
ఇదే నిజం, గూడూరు: మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గూడూరు, చంద్రుగూడెం, గొల్లగూడెం, వడ్డెరగూడెం శివారు గ్రామాలలో ఉన్న ముత్యాలమ్మ బోనాల సందర్భంగా, గూడూరు మాజీ సర్పంచ్ నునావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో, దేవాలయాలకు కలర్స్, లైటింగ్, డీజే సౌండ్స్, కుల వృత్తుల వారికి మొత్తం ఖర్చులు సుమారు రూపాయలు 1,50,000 తన సొంత ఖర్చులతో ముత్యాలమ్మ గుడి ముస్తాబు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో, మానవత దృక్పథంతో తన సొంత ఖర్చులతో నిర్వాణ చేయనున్నట్లు పేర్కొన్నారు. గూడూరు మేజర్ గ్రామపంచాయతీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు, బోనాల పండుగను సకుటుంబాలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మాజీ సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్ పిలుపునిచ్చారు.