తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడమే నా ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒలింపిక్స్‌లో చిన్న దేశాలు పతకాలు సాధిస్తున్నాయి. పతకాలు సాధించడం అసాధ్యం కాదు.. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందులో భాగంగానే క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ISB విద్యార్థులను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా పేర్కొన్నారు. తెలంగాణ ను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థ గా మార్చాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.