Homeతెలంగాణనన్నూ, నా కొడుకుని విడదీశారు

నన్నూ, నా కొడుకుని విడదీశారు

– కంటతడి పెట్టుకున్న ఆందోల్​ బీజేపీ అభ్యర్థి బాబూమోహన్‌
– నన్ను ఓడించేందుకే నా కుమారుడికి బీఆర్ఎస్ కండువా కప్పారు
– బీఆర్​ఎస్​లో చేరుతున్నాననే ప్రచారం అవాస్తవం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ కంటతడి పెట్టారు. తనను ఓడిచేందుకు తన కుమారుడు ఉదయ్‌భాస్కర్‌తో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని బాబూమోహన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తనని, తన కుమారుడిని విడదీసి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆయన కన్నీరుమున్నిరయ్యారు. శనివారం సంగారెడ్డి జిల్లా రాయికోడులో బాబుమోహన్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తండ్రీకొడుకులను విడదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్​రావు తన కుటుంబాన్ని విడదీసి… తన కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పి ఆనందిస్తున్నారని విమర్శించారు. తాను కూడా బీఆర్​ఎస్​లో చేరుతున్నాననే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్ ఐదు రోజుల క్రితం హరీశ్​రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img