Homeహైదరాబాద్latest Newsనా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు..! నాగార్జున ఎమోషనల్ ట్విట్

నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు..! నాగార్జున ఎమోషనల్ ట్విట్

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ బంధంతో నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఒకటైయ్యారు. కొడుకు నాగ చైతన్య పెళ్లితో నాగార్జున ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలో నాగార్జున మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు, మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేనివిగా చేశాయి అని నాగార్జున పేర్కొన్నారు. నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు-మీరందరూ మాతో పంచుకున్న ప్రేమ మరియు మద్దతు కారణంగా ఇది ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది అని నాగార్జున ట్విట్ చేసారు.

Recent

- Advertisment -spot_img