టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పై పాక్ మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీతో పోలిస్తే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటరంటూ వ్యాఖ్యానించాడు. ‘‘అవును..కోహ్లీ సాధించిన రికార్డులను నా తమ్ముడు ఉమర్ సాధించలేదు. అసలు అతని దరిదాపుల్లోనూ లేడు. కానీ..టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ రికార్డ్స్ కోహ్లీ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి’’అని తెలిపాడు.