Myanmar : శుక్రవారం మయన్మార్‌లో (Myanmar) 7.7 మరియు 6.4 తీవ్రతతో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంపాల ప్రభావం ఎంతగా ఉందంటే, బ్యాంకాక్‌లోని ఒక ఎత్తైన భవనం నేలమట్టమైంది. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లో మొదటి భూకంపం మధ్యాహ్నం 12:05 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో నమోదైన మొదటి భూకంపం మయన్మార్‌లో 10 కి.మీ లోతులో సంభవించింది. మొదటి భూకంప కేంద్రం సేజ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్లు (10 మైళ్ళు) దూరంలో ఉంది. మళ్ళీ 13 నిమిషాల తర్వాత మయన్మార్‌లో రెండవ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఒక పెద్ద భవనం పై అంతస్తులోని స్విమ్మింగ్ పూల్ నుండి నీరు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో కార్మికులు ఎవరైనా ఉన్నారా లేక శిథిలాల కింద చిక్కుకుపోయారా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే, 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.