HomeతెలంగాణMynampally Hanmanth Rao:మైనంపల్లి కూల్​

Mynampally Hanmanth Rao:మైనంపల్లి కూల్​

– నిన్న హరీశ్​పై విరుచుకుపడిన హన్మంత్​ రావు
– ఇండిపెండెంట్​గా పోటీ చేస్తామంటూ ప్రకటన
– తాజాగా వెనక్కి తగ్గిన మైనంపల్లి
– బీఆర్ఎస్​లోనే కొనసాగాలని నిర్ణయం!
– టికెట్​ రావడంతో మల్కాజిగిరి సెగ్మెంట్ లో అనుచరుల సంబురాలు

ఇదేనిజం, హైదరాబాద్​: మైనంపల్లి హన్మంత్​ రావు నిన్న (సోమవారం) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. తనకు తన కుమారుడికి గనక టికెట్​ ఇవ్వకకపోతే ఇండిపెండెంట్​ గా పోటీచేస్తామంటూ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్​ రావుపై సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి కామెంట్స్​ ను కేటీఆర్ సైతం ఖండించారు. తాము హరీశ్​ రావుకు అండగా ఉంటామంటూ ప్రకటించారు. తిరుమలలో మైనంపల్లి హరీశ్​ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం ప్రకటించిన బీఆర్ఎస్​ ఫస్ట్​ లిస్ట్​ లో మాత్రం మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉంది. మరోవైపు పార్టీ అసంతృప్తుల విషయంలో కేసీఆర్​ సైతం కాస్త సీరియస్​గానే స్పందించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఉపక్షించబోమన్నారు. అయితే మైనంపల్లి మీద వేటు పడబోతున్నదని.. మల్కాజిగిరి స్థానంలో పోటీ చేసేందుకు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్​ రెడ్డి రెడీగా ఉన్నారని కూడా ప్రచారం సాగింది. కానీ చివరకు ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు.

వెనక్కి తగ్గిన మైనంపల్లి..
సోమవారం ఉదయం తీవ్ర కోపంగా కనిపించిన మైనంపల్లి సాయంత్రానికి చల్లబడ్డారు. తాను బీఆర్ఎస్​ లో కొనసాగబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయన అనుచరులు సంబురాలు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మైనంపల్లి కామెంట్స్​ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. సహజంగా బీఆర్ఎస్ నేతలెవరూ అధిష్ఠానాన్ని ధిక్కరించి పెద్దగా కామెంట్స్​ చేయరు.. ఒకవేళ చేసినా ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండరు. కానీ మైనంపల్లి మాత్రం నిన్న సాహసించి పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్​ చేశారు. కేసీఆర్​ కూడా ఆయన వ్యాఖ్యలను లైట్​ తీసుకున్నట్టు సమాచారం. దీంతో చివరకు మైనంపల్లి వివాదం సద్దుమణిగింది. మరి మైనంపల్లి తన కుమారుడు రోహిత్​ ను ఇండిపెండెంట్​ గా బరిలో దించుతారా? లేదా? అన్న విషయం వేచి చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img