హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్జోన్ హోటల్లో చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని శృతిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన శృతి (23) ఈ నెల 16న ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. ప్రియుడు జీవన్ తో పెళ్లి విషయంలో గొడవ కారణంగానే శృతి సూసైడ్ చేసుకున్నట్లు తేల్చారు. కాగా, పోలీసులు జీవన్ ను అదుపులోకి తీసుకున్నారు.