Homeసినిమాసంక్రాంతి బరిలో ‘నా సామి రంగ’!

సంక్రాంతి బరిలో ‘నా సామి రంగ’!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా సామి రంగ’ మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ సినిమా షూటింగ్​ను డిసెంబర్ 7 నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 సంక్రాంతి సీజన్‌లో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో నిర్మాణానంతర కార్యక్రమాలను త్వరగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించి గత నెలలో రిలీజైన నాగ్ ఫస్ట్​లుక్​ ఆయన ఫ్యాన్స్​ను ఎంతో ఆకట్టుకుంది. ఊర మాస్ క్యారెక్టర్​లో నాగార్జున కనిపించనున్నారు. శ్రీనివాస చిట్టూరి తన బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం నాగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img