Nag Ashwin : సీఎం రేవంత్ ప్రభుత్వంపై ”కల్కి” మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) అసహనం వ్యక్తం చేసారు. ”ఎవడె సుబ్రమణ్యం” సినిమా విడుదలై 10 ఏళ్ళు కావడంతో ఈ సినిమాని రి-రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ రేవంత్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మెస్తు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై “మన ఖర్మ ఏమి చేస్తాం” అంటూ నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ఆ 400 ఎకరాలు ఉన్న ఏరియా అనేది గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు.. గ్రీన్ ఏరియా అక్కడ చాలా వనరులు ఉన్నాయి.. అందుకే అక్కడ ఉన్న 400 ఎకరాల చెట్లును కొట్టకపోతే మనకే మంచింది అని నాగ్ అశ్విన్ అన్నారు.