నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్ 4న వైభవంగా జరిగింది.ఈ వివాహ బంధంతో నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఒకటైయ్యారు. నేడు శ్రీశైలం మల్లన్న స్వామివారికి కొత్త దంపతులు నాగచైతన్య, శోభిత రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నూతన దంపతులతో పాటు కుటుంబ సభ్యులు.. ఆలయ మహాద్వారం ద్వారా మల్లిఖార్జున, భ్రమరాంబిక సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.