నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు అక్కినేని నాగార్జున ఖండించారు. ‘‘గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ వ్యాఖ్యలని ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. మా కుటుంబంపై మీరు చేసిన ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని ట్వీట్ చేశారు.