తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు చెరగని ముద్ర వేశారు. అక్కినేని నాగేశ్వరరావు 1941 నుండి 2014 మధ్య కాలంలో 256 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు.ఆయన నటనతో, డ్యాన్సులతో జనాలను అలరించారు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌పై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఈ విషయంపై అక్కినేని నాగార్జున స్పందించారు. గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో ఏఎన్నార్‌కు నాగార్జున నివాళులర్పించారు. ఈ సందర్శంగా మరోసారి అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై నాగార్జున స్పందించారు. ఏఎన్నార్ బయోపిక్ పై నాగార్జున మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో ఆయన జీవితాన్ని బయోపిక్‌గా కాకుండా డాక్యుమెంటరీగా తీసుకురావడమే మేలు. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం. బయోపిక్ అంటే డ్రమటిక్ ఉండాలి. కానీ.. ఆయన జీవితమంతా ఎదుగుతూనే సాగిపోయింది. ఆయన జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎక్కడా వైఫల్యాలు లేవు. కాబట్టి.. నాన్నగారి బయోపిక్ బోర్ కొడుతుంది. కావాలంటే.. కొన్ని ఫిక్షనలైజ్ చేసి డాక్యుమెంటరీ తీయడం బెటర్’ అని నాగార్జున అన్నారు.