Homeహైదరాబాద్latest Newsనల్లగొండ జిల్లా… ఆ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీకు ఎదురుదెబ్బ

నల్లగొండ జిల్లా… ఆ కేసులో బీఆర్‌ఎస్‌ పార్టీకు ఎదురుదెబ్బ

నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేత వ్యవహారంలో బీఆర్‌ఎస్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలన్న ఆదేశాలను పక్కన పెడుతూ సింగిల్ జడ్జి తీర్పును సవరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని నిర్మించేందుకు జీఓ 167, జీఓ 66 ద్వారా నల్గొండ గ్రామ పరిధిలోని ఎకరం భూమిని 2019లో కేటాయించారు. నల్లగొండ మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ ప్రహరీతో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. అనంతరం భవనాన్ని క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అధికారులు దరఖాస్తును తిరస్కరించి 15 రోజుల్లోగా అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లను కొట్టేయడంతోపాటు రూ.లక్ష జరిమానా విధించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నల్గొండ జిల్లా శాఖ డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేసింది.

Recent

- Advertisment -spot_img