Nalgonda : సార్వత్రిక ఎన్నికలకు ముందు నల్గొండ జిల్లాలో అక్రమ మద్యం, నగదు భారీ మొత్తంలో పట్టుబడుతోంది. ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా చేసిన తనిఖీల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 573 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. 3161 లీటర్ల మద్యం, నగదు, గంజాయి, బంగారు ఆభరణాలు స్వాధీనంతో సీజ్ విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.