ఇదే నిజం, కుత్బుల్లాపూర్: నియోజక వర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి గాజుల రామారంలోని దూదిమెట్ల సోమేశ్ యాదవ్, శివ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ 23వ శివ పూజా మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని ప్రజలను చల్లగా చూడాలని, ఆ దేవదేవుడి కరుణా కటాక్షాలతో గత 23 సంవత్సరాలుగా నిర్విరామంగా శివ మహా పడిపూజ కార్యక్రమం ఇంతటి వైభవోపేతంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.