– ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ అరెస్ట్
– ఆధారాలు లేకపోవడంతో బెయిల్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు శివరామ్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.5వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. శనివారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. శివరామ్ సోదరుడు మునిరామ్ రాథోడ్ స్పందిస్తూ.. ‘ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో మా అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు. మాపై పోలీసుల వేధింపులు అధికమయ్యాయి.’ అంటూ ఆరోపించారు.