Nampally Exhibition: నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ప్రదర్శనకు ఈసారి సందర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ సొసైటీకి సోమవారం విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన 46 రోజుల పాటు కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనతో జనవరి మూడో తేదీ నుంచి ప్రారంభించారు.