Nani : నాచురల్ స్టార్ నాని (Nani) తన సినీ కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా మారి మంచి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం నాని చేసిన అన్ని సూపర్ హిట్లు అవుతున్నాయి. అయితే నాని అట్టు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నాని కొత్తగా ”కోర్ట్” అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానితో పాటు పలు దర్శకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో నాని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీ కి వచ్చి16 ఏళ్ళు అయింది. ఈ సినిమా నిర్మాతగా నేను చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని మిస్ కాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ఈ సినిమాని చూడండి. ‘కోర్ట్’ సినిమా కంటే ”హిట్ 3” సినిమాకి పది రెట్లు ఎక్కువ ఖర్చు చేశాను. ఈ కోర్ట్ సినిమా విజయం సాధించకపోతే నా తదుపరి సినిమా ‘హిట్ 3’ని ఎవరూ చూడొద్దు అని నాని అన్నాడు. దీంతో నాని చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నాని చేసిన కామెంట్స్ .. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి అని అంటున్నారు. ఒకవేళ ”కోర్ట్” సినిమా బెడిసికొడితే నాని పరిస్థితి ఏంటి అని అంటున్నారు.