Nani movie : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ”హిట్-3”. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అయితే నాని సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 30 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో కొంచం యాక్షన్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు కొన్ని కోతలు కూడా సూచించింది. అలాగే ఈ సినిమాకు 18 ఏళ్లలోపు పిల్లలు, ఫ్యామిలీ వారు ఈ సినిమా చూడటానికి వీల్లేదని సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ సినిమాలో తమిళ హీరో కార్తీ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడు. నాని కెరీర్‌లో ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.