Nani – Sujith : నేచురల్ స్టార్ నాని – క్రేజీ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించిన సుజిత్ ”ఓజి” సినిమాతో బిజీగా ఉండడంతో లేట్ అవుతా వస్తుంది. అయితే త్వరలోనే ”ఓజి” సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ క్రమంలో “ఓజి” పూర్తయిన తర్వాత సుజిత్ నానితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నాని – సుజిత్ సినిమా కూడా మాఫియా – లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందే అవకాశం ఉందని, ఇది నాని ఇమేజ్‌కు భిన్నంగా హెవీ యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం నాని తన లేటెస్ట్ మూవీ “హిట్ 3″ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరి.. ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో సుజిత్‌తో సినిమా నాని కెరీర్లో మరో బిగ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా నాని – సుజిత్ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ”బ్లడీ రోమియో” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది.