నేచురల్ స్టార్ నాని యువ ప్రతిభావంతుల్ని ఎంకరేజ్ చేయడంలో ముందుటాడని చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అయిన నాని కొత్త వాళ్లని ప్రోత్సహిచడంలో ఎప్పుడూ ముందుంటాడు. తనతో పాటు మరింత మంది ఔత్సాహికుల ప్రతిభల్ని ప్రోత్సహించి వాళ్లకి లైఫ్ ఇస్తున్నాడు. ఇప్పటికే నాని చాలా మందిని దర్శకులుగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాసెస్ అలా నడుస్తూనే ఉంటుంది. తానెంత పెద్ద స్టార్ అయినా ట్యాలెంట్ ఉంటే మాత్రం అతని నుంచి ప్రోత్సాహం తప్పక లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ‘బలగం’ దర్శకుడు వేణుతో సైతం నాని సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అటు నాని..ఇటు దిల్ రాజు ఎంట్రీతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ వివరాలు కూడా లీక్ అవుతున్నాయి. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దాదాపు ఆ టైటిల్ కన్పమ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కథని ఆధారంగా చేసుకుని దర్శకుడు వేణు ఆ టైటిల్ సూచించడంతో నాని..దిల్ రాజు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. వేణు విజన్ కి పెద్ద పీట వేస్తూ ..తనకి పూర్తిగా స్వేచ్ఛని కల్పించినట్లు తెలుస్తోంది. నాని..దిల్ రాజు ఇద్దరు దర్శకులకు అవసరమైన సూచనలు..సలహాలు ఇస్తుంటారు. కథలోనూ వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. మరి తాజా ప్రాజెక్ట్ లో వాళ్లిద్దరి భాగస్వామ్యం కేవలం నటుడు..నిర్మాతగానే సరి పెడుతున్నారా? స్టోరీలో భాగమవుతున్నారా? అన్నది తెలియాలి. టైటిల్ నిబట్టి ఇది కూడా తెలంగాణ బేస్ స్టోరీలా ఉందని తెలుస్తుంది. ‘బలగం’ కూడా తెలంగాణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా అన్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో నిర్మాణమైన సినిమా మంచి వసూళ్లని సాధించింది.