విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని ఇవాళ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. ఆ మరు క్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు.
ఎక్స్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు.. ‘‘నేను పార్టీకి అవసరంలేదని చంద్రబాబు నాయుడు గారు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది నా భావన’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరిలతో తానున్న ఫొటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు.