Nano urea : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమే కాకుండా, రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వ్యవసాయ యూనివర్సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు
రూపకర్త భారతీయుడు
భారతీయుడైన రమేష్ రాలియా దీనిని కనుగొని భారత రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని ఆ టెక్నాలజీని మన దేశంలోని ఇఫ్కో సంస్థకు అందించారని అన్నారు.
36 వేల సహకార సంఘాల సమాఖ్య అయిన ఇఫ్కో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని చెప్పారు.11 వేల మంది రైతుల పొలాలలో నానో యూరియాను ప్రయోగించి ఫలితాలు పరిశీలించి మార్కెట్ లోకి విడుదల చేశారని మంత్రి వెల్లడించారు
ద్రవరూపం లో
తొలిసారి యూరియాను ద్రవరూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. దీనిమూలంగా ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారని కొనియాడారు
దేశంలో వినియోగించే 70 శాతం యూరియా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం
అత్యధిక ఎరువులు, యూరియా వాడకం మూలంగా చెరువులు, కుంటలు, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి.ఇటువంటి అనేక దుష్పరిణామాలను అరికట్టడం, రైతాంగానికి మేలు చేయాలి అన్న ఉద్దేశంతో తెలంగాణలో నానో యూరియాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు