మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ఇది ప్రతి ఇంట్లో ఉండే వ్యవహారమని, మీ ఇంట్లో అన్నయ్య, అక్క మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా లేవా అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇటీవలే జగన్ ఒత్తిడికి గురయ్యోరో ఏమో అని మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలుపై జగన్ స్పందించారు. నారా లోకేష్‌కి బ్రెయిన్ పని చేసే శక్తి లేదు..అందుకే పప్పు అని పిలుస్తారేమో.. హేతుబద్ధమైన వ్యక్తిలా కనిపించడు.. పప్పులా మాట్లాడతాడు..లేదంటే మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన దిశా బిల్లు ఇలా పక్కనపడేస్తారా? అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.