Homeహైదరాబాద్latest NewsNara Lokesh : TDP కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నరు

Nara Lokesh : TDP కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నరు

– ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​
ఇదే నిజం, ఏపీ బ్యూరో: తప్పుడు కేసులు బనాయించడంలో ఏపీలోని కొందరు పోలీసులు గిన్నిస్‌ బుక్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లకు చెందిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సోషల్‌ మీడియాలో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారని లోకేశ్‌ మండిపడ్డారు. టీడీపీ కేడర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న కొంతమంది పోలీసులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img