Narayana : అనంతపురం రూరల్ ఏరియాలోని సోమలదొడ్డి నారాయణ (Narayana) కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే మూడు అంతస్తుల పైనుంచి దూకాడు. ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో చరణ్ మరణించాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అయితే చరణ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫీజుల ఒత్తిడితోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడన్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.