Narendra Modi , కార్గిల్: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని సోమవారం కార్గిల్ చేరుకున్నారు. కార్గిల్ సైనికులతో కలిసి మోదీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కార్గిల్ చేరుకున్న ప్రధాని( Narendra Modi )ఫొటోలను షేర్ చేసింది.2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దీపావళి వేడుకలను సైనికులతో కలిసి చేసుకున్నారు. ( Narendra Modi )
• అప్పటి నుంచి ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొంటున్నారు. గతేడాది జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్గిల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.( Narendra Modi )