Narendra modi:
తెలంగాణలో రైల్వే ట్రాక్‌ల కనెక్టివిటీని పెంచుతున్నామని నరేంద్ర మోదీ వెల్లడించారు . తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దే బీజేపీ కార్యకర్త రూపంలో వరంగల్ కి వచ్చాను . .తెలంగాణ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాం .. కాంగ్రెస్,బీఆర్ ఎస్ కు పత్తా లేకుండా బీజేపీ చేస్తుంది , జనసంఘ్ కాలం నుంచి వరంగల్ మాకు కంచుకోట లాంటిది . బీజేపీకి రెండు సీట్లు దేశం లో ఉంటె ఒక్కటి హనుమకొండ నుంచి ఉంది. 2011 లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ట్రైలర్ చూపించింది. భద్రకాళి అమ్మవారికి , సమ్మక్క,సారలమ్మ, రాణి రుద్రమదేవి పరాక్రమానికి నమస్కా రం అంటూ తెలుగులో ప్రధాని ప్రసంగం మొదలు పెట్టారు .
తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యం అన్నారు . రాబోయేది బీజేపీ ప్రభుత్వం అన్నారు ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ముందుందన్నారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక హబ్‌గా మారుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. అయినప్పటికి వాటిని స్వంత అవసరాలకు కేసీఆర్ కుటుంబం వాడుకుంటున్నాదని అన్నారు తెలంగాణలో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కేసీఆర్ సర్కార్ అంటే అత్యంత అవినీతి ప్రభుత్వమని, అవినీతి ఆరోపణలు లేని తెలంగాణ ప్రాజెక్టు లేదన్నారు .కేసీఆర్ అవినీతి ఢిల్లీకి పాకింది . అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగేది . ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అవినీతి పెరిగి పోయిందని అన్నారు . కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూ రుకుపోతుందని ఎప్పుడు అనుకోలేదు .కుటుంబ పార్టీల డిఎన్ఏ అవినీతి మయం అన్నారు . ఉద్యమ సమయంలో నిరు ద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు . అవన్నీ అబద్ధాలే . కుటుంబ కబంధ హాస్టల్లో తెలంగాణ చిక్కుకుంది .దీని కోసమేనా యువత ఆత్మబలిదానాలు చేసిందని మోదీ ప్రశ్నించారు.
తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి? యువత, ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగట్లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేస్తామన్నారు . తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని . తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయన్నారు కేసీఆర్ సర్కార్ అవినీతిని పెంచి పోషిస్తోంది. కేసీఆర్ సర్కార్ అవినీతి పై దర్యాప్తు సంస్థలు ద్రుష్టి పెట్టాయని అన్నారు . కేసీఆర్ సర్కార్ కేవలం నాలుగు పనులు చేస్తున్నారని అన్నారు నిరంతరం కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని తిట్టాలని అన్నారు కుటుంబ పార్టీని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు .