ఇదే నిజం, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కానుకగా వంటగ్యాస్ సిలిండరుపై International Woman Day సందర్భంగా దేశ మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంటగ్యాస్ సిలిండరుపై రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా (Twitter) వేదికగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వంటగ్యాస్ సిలిండరుపై రూ.100 తగ్గించడం ద్వారా దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు కొంతమేరకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. అయితే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పేరు మీద వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని కూడా 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ప్రభుత్వం ప్రతి LPG సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. యాడాదికి 12 సిలిండర్లు రీఫిల్లింగ్ పొందే వీలు కల్పిస్తుంది.