HomeసినిమాNaresh : Tollywood is also leading in helping Naresh : Tollywood...

Naresh : Tollywood is also leading in helping Naresh : Tollywood సాయం చేయడంలోనూ ముందుంటుంది

– రాజకీయాల గురించి ఎక్కువగా చర్చించను
– వ్యక్తిగత కక్షతో ఎవరినైనా బంధించడం తిరుగుబాటుకు కారణమవుతుంది
– చంద్రబాబు అరెస్ట్​పై సీనియర్ నటుడు నరేశ్​ వ్యాఖ్యలు

ఇదే నిజం, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్​కు సంబంధించి సీనియర్ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు డైరెక్షన్​లో తెరకెక్కిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా బుధవారం నరేశ్ మీడియాతో మాట్లాడరు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ స్పందన ఏంటి? అని మీడియా నరేశ్​ను ప్రశ్నించగా.. నేను ప్రత్యేకంగా ఏ ఒక్క నాయకుడి గురించి మాట్లాడాలనుకోవడం లేదని ఆయన తెలిపారు. ధర్మం ఎప్పుడూ నిలబడుతుందన్నారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా సరే బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచించిందన్నారు. ఆ తిరుగుబాటు ఫలితం తప్పక వస్తుందని నరేశ్ తెలిపారు. ‘ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైలులో ఉన్నారు. తర్వాత ఏమైంది. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయింది.

రాజకీయంగా వారసులు రావడం అనేది తప్పు లేదా ఒప్పు అని నేను మాట్లాడను. నాయకులు సరిగ్గా పనిచేస్తే దానికి తప్పకుండా విలువ ఉంటుంది. ఇప్పుడున్న రోజుల్లో డబ్బుకు రాజకీయానికీ చిక్కుముడులు పడ్డాయి. ఆ చిక్కుముడులను విప్పాలి.
రాజకీయ పరమైన చర్చలోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. సినీ పరిశ్రమ ఎప్పుడూ వినోదాన్ని అందించడమే కాకుండా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మేమున్నామంటూ సాయం చేస్తుంటుంది. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ గారు ఏపీకి వరదలు వచ్చినప్పుడు జనాలకు బాధితులకు సాయం చేసేందుకు జోలె పట్టుకుని డబ్బు సేకరించారు. చంద్రబాబు అరెస్ట్​పై సమాధానం ప్రజలే చెప్పాలి. మేం కూడా సమాజంలో భాగమే. ఇప్పుడు సమాజం మొత్తం నిశ్శబ్దంగా ఉందంటే.. ఒక తిరుగుబాటు కోసమే’ అని నరేశ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img