అల్లరి నరేష్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘బచ్చల మల్లి’. ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా 990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో నరేష్ తన నటనతో కట్టిపడేసాడు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కధ ప్రేమతో మొదులై నరేష్ కు పలు సంఘటనలు ఎదురవుతాయి. వాటిని బచ్చల మల్లి ఎలా డీల్ చేస్తారు అనే విషయం తెరమీద చూడాలి. చాలా రోజులు తర్వాత నరేష్ ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడు అని తెలుస్తుంది. ఈ సినిమాని డిసెంబర్ 20వ థియేటర్లో రిలీజ్ కానుంది.