Homeఅంతర్జాతీయంకొంపముంచిన చంద్రుడిపై శృంగారం కోరిక..

కొంపముంచిన చంద్రుడిపై శృంగారం కోరిక..

చంద్రుడిపై తన ప్రియురాలితో కలిసి శృంగారం చేయాలనే కోరిక అతడిని దొంగలా మార్చింది.

జాబిలి మీద నుంచి సేకరించి.. దాచిపెట్టిన చంద్రుడి రాళ్లను దొంగిలించి తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు.

హాలీవుడ్ యాక్షన్ మూవీని తలపించే చోరీ ఇది.

జాబిలి వెన్నెలలో ఆరుబయట పందిరి మంచం వేసుకుని శృంగారం చేయాలని చాలామంది కలలుగంటారు.

దాదాపు ఇలాంటి ఆలోచనే నాసా(NASA)కు చెందిన ఓ ట్రైనీకి వచ్చింది. కానీ, అతడి కోరిక జాబిలి వెన్నెలలో చేయాలని కాదు.

నేరుగా చంద్రుడి మీదే తన ప్రియురాలితో శృంగారం చేయాలనేది అతడి కోరిక. కానీ, అక్కడికి తన ప్రియురాలిని తీసుకెళ్లడం కష్టం.

పైగా ఇప్పట్లో నాసాకు చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపే ఆలోచన కూడా లేదు.

అయితే, అతడిలో ఉన్న ఆ కోరిక ఓ పాడు ఆలోచనకు దారి తీసింది. దాని వల్ల అతడు తన భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నాడు.

ఎంతకీ ఎవరా వ్యక్తి? ఏం చేశాడు? చంద్రుడి మీద శృంగారం చేయడం ఎలా సాధ్యమైంది?

లక్ష్యం ఒకటి.. చేసింది మరొకటి: 

థాడ్ రాబర్ట్స్‌ అనే వ్యక్తి భవిష్యత్తులో అంగారుకుడిపై అడుగుపెట్టాలనే లక్ష్యంతో నాసాలో ఇంటర్న్‌గా చేరాడు.

కానీ అతడు చేసిన పాడుపని వల్ల అతడి భవిష్యత్తు సూన్యమైంది. చంద్రుడి మీద తన ప్రియురాలితో కలిసి శృంగారంలో పాల్గొవాలనే వింత కోరిక వల్ల అతడిని దొంగలా మార్చింది.

నేరుగా చంద్రుడి మీదకు వెళ్లి శృంగారం చేయడం కష్టమని భావించి.. చంద్రుడి మీద నుంచి తీసుకొచ్చిన రాళ్లు, దూళి పైనే ఆ పని చేయాలని అనుకున్నాడు.

ఈ సందర్భంగా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల నాసా ల్యూనార్ ల్యాబ్‌లో దాచిపెట్టిన 101 గ్రాముల చంద్రుడి రాళ్లపై అతడు కన్ను పడింది.

దాని విలువ 21 మిలియన్ డాలర్లు. అంటే భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం.. రూ.157.48 కోట్లు. అయితే, థాడ్‌కు మొదట్లో దాన్ని అమ్మాలనే ఆలోచన లేదు.

దాన్ని ఎలాగైన దొంగిలించి తన కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

పైగా దానికి అక్కడ పెద్దగా రక్షణ కూడా లేకపోవడంతో తన ప్లాన్ సులభంగా అమలు చేయవచ్చని భావించాడు.

బెల్జియం శాస్త్రవేత్తతో మంతనాలు: 

థాడ్ తన ప్లాన్‌ను బెల్జియంకు చెందిన ఖనిజ శాస్త్రవేత్తను సంప్రదించాడు.

చంద్రుడి రాళ్లు చాలా విలువైనవని, చాలా డబ్బు వస్తుందని తెలిపాడు. దీంతో థాడ్ ఆలోచన మారిపోయింది.

ఒక వైపు డబ్బు.. మరోవైపు తన కోరిక రెండూ తీరుపోతాయని భావించాడు.

నాసాలో తనపాటు ఇంటర్న్ చేస్తున్న థాడ్ ప్రియురాలు టిఫ్నీ ఫోలర్, షే సౌర్‌లలో కలిసి ప్లాన్ తయారు చేశాడు.

లాకర్‌ను పెకిళించి మరీ..: 

2002, జులై రాత్రి.. ఆ ముగ్గురు తమ అధికారిక ఐడి కార్డులతో ల్యాబ్‌లోకి ప్రవేశించారు.

అయితే, సేఫ్ లాకర్‌లో ఉన్న చంద్రుడి రాళ్లను దొంగిలించడం అంత సులభం కాదని థాడ్‌కు అర్థమైపోయింది.

ఆ లాకర్‌కు ఉన్న ట్యాగ్ మీద ఉన్న కోడ్‌ను అర్థం చేసుకుని తిప్పితేనే అది తెరుచుకుంటుందని తెలుసుకున్నారు.

కానీ, అది వారికి సాధ్యం కాలేదు. దీంతో మొత్తం లాకర్‌ను పెకిళించి ల్యాబ్ నుంచి తీసుకెళ్లిపోయారు.

ఆ తర్వాత ఓ హోటల్‌కు తీసుకెళ్లి దాన్ని రంపాలతో కట్ చేసి తెరిచారు.

సెక్స్ ఆన్ మూన్..: 

ఆ తర్వాత థాడ్, అతడి గర్ల్‌ఫ్రెండ్.. అందులో ఉన్న చంద్రుడి రాళ్లను బూడిదలా చేసుకుని మంచంపై చల్లారు.

ఆ తర్వాత శృంగారంలో మునిగితేలారు. చంద్రుడి మీద శృంగారం చేస్తున్నట్లుగా ఫీలయ్యారు.

ఎఫ్‌బీఐ రిపోర్టుల ప్రకారం.. వారు చంద్రుడి రాళ్లను అక్రమంగా అమ్మాలని చూశారు. అవి ఎక్కువ బరువు తూగాలనే ఉద్దేశంతో కల్తీ చేశారు.

ఫలితంగా అది శాస్త్రవేత్తలకు ఉపయోగపడకుండా పోయాయి. వారు మూడు దశాబ్దాల నాటి గుర్తులను పూర్తిగా తుడిపేశారు.

ఇలా దొరికిపోయారు: 

అలా కల్తీ చేసిన చంద్రుడి రాళ్లను వారు ఒక గ్రాము 5వేల డాలర్లు (రూ.3.74 లక్షలు) చొప్పున అమ్మేందుకు బెల్జియం శాస్త్రవేత్తతో బేరం కుదుర్చుకున్నారు.

అపోలో-11 చంద్రుడిపై ల్యాండైన 33వ వార్షికోత్సవం రోజైన జులై 20వ తేదీన ఫ్లోరిడాలోని ఓర్లాండో గల ఓ ఇటాలియన్ రెస్టారెంటులో కలుసుకుందామని ఆ శాస్త్రవేత్త చెప్పాడు.

ప్లాన్ ప్రకారం థాడ్.. మెటీరియల్‌తో అక్కడికి చేరాడు. కానీ, అక్కడే అతడి ప్లాన్ బెడిసికొట్టింది.

ఆ శాస్త్రవేత్త అప్పటికే థాడ్ గురించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇచ్చాడు.

దీంతో అధికారులు థాడ్, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకుని చంద్రుడి రాళ్లను స్వాధీనం చేసుకున్నారు.

థాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?: 

ఈ నేరానికి గాను థాడ్‌కు కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఇదివరకు ఉటా‌ మ్యూజియంలో డైనోసార్ల ఎముకులు దొంగిలించిన కేసులో కూడా కోర్టు థాడ్‌కు శిక్ష వేసింది.

ప్రస్తుతం థాడ్ వయస్సు 44 ఏళ్లు. జైల్లోనే అతడు పిజిక్స్, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీలో డిగ్రీలు పూర్తి చేశాడు.

తాను యవ్వనంలో చేసిన తప్పులను గురించి చెప్పి చెప్పి విసిగిపోయానని, ఇప్పుడు అందరికీ ఖగోళ విజ్ఞానం అందించడానికే ప్రాధాన్యమిస్తున్నానని ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు.

చూశారుగా.. నాసా వంటి సంస్థలో ఇంటర్న్ దొరకడమే కష్టం. అలాంటిది అతడు తన దురాలోచన వల్ల విలువైన భవిష్యత్తును పాడు చేసుకుని జైలుపాలయ్యాడు.

అందుకే, ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించాలి. క్రేజీ పనులకు పోతే.. జీవితం నాశనమవుతుంది.

Recent

- Advertisment -spot_img