Homeహైదరాబాద్latest Newsఉత్తమ తెలుగు సినిమాగా 'కార్తికేయ 2'కి నేషనల్ అవార్డు

ఉత్తమ తెలుగు సినిమాగా ‘కార్తికేయ 2’కి నేషనల్ అవార్డు

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. భారత రాష్ట్రపతి, ద్రౌపది ముర్ము, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు పలువురు కళాకారులను సత్కరించారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘కార్తికేయ 2’ నేషనల్ అవార్డు అందుకుంది.అలాగే నటుడు మిథున్ చక్రవర్తికి తన దశాబ్దాల కెరీర్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు. కాంతారా సినిమాకి గానూ రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డును రాష్ట్రపతి అందజేశారు. ‘తిరుచిత్రంబలం’, ‘కచ్ ఎక్స్‌ప్రె’స్ సినిమాలకు గాను నిత్యా మీనన్ మరియు మానసి పరేఖ్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రం అవార్డు ‘పొన్నియిన్ సెల్వన్’ అవార్డు దక్కింది.

Recent

- Advertisment -spot_img