Homeజిల్లా వార్తలుస్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు

స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్స్ డే వేడుకలు సోమవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యన్ వి టి, సూపర్డెంట్ డాక్టర్ రాముల నాయక్ డాక్టర్స్ మరియు సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్స్ ని శాలువలతో సత్కరించి మెమొంటోస్ మరియు స్వీట్స్ అందజేసినారు. అనంతరం అధ్యక్షుడు యన్ విటి మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మ ని ఇస్తారని, భగవంతుని స్వరూపులని, బీద బిక్కి చూడకుండా సేవలు చేస్తూ తమ సాయి శక్తుల కొనఊపిరితో ఉన్న వాళ్ళని సైతం ప్రాణాలు పోయడానికి ఎంతో కృషి చేస్తున్న గొప్ప వాళ్ళని, అలాంటి డాక్టర్స్ ని గౌరవించుకోవడం అనేది గొప్ప అదృష్టమని, ప్రతి ఒక్కరూ డాక్టర్స్ ని గౌరవించాలని సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, బత్తుల అమర్, వైయస్ కరుణాకర్, భాస్కర్ రెడ్డి, తాళ్ల సురేష్, వంగూరు వెంకటేశ్వర్లు, వల్లమల్ ఆంజనేయులు, బుడిగ వెంకటేష్, సతీష్ గౌడ్, పగిడిమర్రి శ్రీను, జయలక్ష్మి, డాన్స్ మాస్టర్ జగన్, చక్రపాణి, రాజకుమార్, వెంకటరెడ్డి, శ్రీకాంత్ ,రాజు, కరాట మాస్టర్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img