Homeజిల్లా వార్తలుఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవము.. వైద్యులను సన్మానిస్తున్న ప్రముఖులు..

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవము.. వైద్యులను సన్మానిస్తున్న ప్రముఖులు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బీ జే రావు, డాక్టర్ జీ శశికాంత్, డాక్టర్ నిగమ్ రిజిస్ట్రార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హెచ్సీ యూ చీఫ్ మెడికల్ ఆఫీసర్, హైదరాబాదు డాక్టర్స్ ఫోరమ్ కన్వీనర్ కెప్టెన్ రవీంద్ర కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బీ సీ రాయ్ చిత్రపటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం అతిథులు శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేటు వైద్యశాలలో రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 30 మంది వైద్యులను డాక్టర్ B. C. రాయ్ పురస్కారం, శాలువా ,పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ శంకరనారాయణ రచించిన ‘డాక్టర్ శతకం’ గ్రంధాన్ని వైస్ ఛాన్సలర్ బీజే రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు త్రివేణి, వాణి సాంబశివరావు, ధర్మసాగర్, జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, విష్ణు ప్రసాద్, కుమారి , దివ్య , వరలక్ష్మి , వీణ , సుజాత ,హస్పిటల్ సిబ్బంది, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img