Homeహైదరాబాద్latest Newsజాతీయ రోడ్డు భద్రతపై అవగాహన ప్రదర్శన

జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన ప్రదర్శన

– బెల్ట్,హెల్మెట్ దారులకు చాక్లెట్లు అందజేసిన ఎస్ఐ

ఇదే నిజం,నెల్లికుదురు: జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఎస్సై క్రాంతి కిరణ్, విద్యార్థులతో కలిసి బుధవారం అవగాహన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్లలో బెల్ట్ పెట్టుకుని, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించిన వారిని అభినందిస్తూ విద్యార్థులచే చాక్లెట్లు పంపిణీ చేయించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. సీట్ బెల్ట్‌లు, హెల్మెట్లు ధరించి వాహనాలు నడపడం సురక్షితమని, మనం క్షేమంగా తిరిగి రావాలని మనకోసం మన వారు ఎదురు చూస్తుంటారని గుర్తుంచుకోవాలని అన్నారు. అధిక వేగం ప్రమాదకరమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవ్ చేసే వారితో పాటు రోడ్డుపై ప్రయాణించే వారికి సైతం ప్రమాదకరమని హెచ్చరించారు. ఆయా వాహనాల కెపాసిటీ ప్రకారమే ప్రయాణికులను, సరకులను తీసుకువెళ్లాలని లేనిపక్షంలో వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కందునూరి వెంకన్న, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img