ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడ దినోత్సవం గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర నుండి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డిఓ శ్రీరాములు , మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, అధ్యక్షుడు ఎన్విటి సభ్యులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి అధ్యక్షుడు ఎన్ వి టి, యూట్యూబ్ సంచలన సింగర్ రాము, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, వైయస్ కరుణాకర్ కలసి పూలమాలలు వేసి జోహార్లు అర్పించినారు. ఎన్విటి మాట్లాడుతూ ఇది క్రీడాకారులకు ఒక పండుగ లాంటిది అని, ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభం కావాలని, అవుట్ డోర్ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసినారు. ప్రచార కార్యదర్శి తాళ్ల సురేష్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడని, ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులలో మూడు గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడని, 1928 1932 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడని, ఒకసారి తను గోల్డ్ వేసిన తర్వాత అది పడకపోతే గోల్పిస్ట్ కొలతలు సరి చూడవలసిందిగా ఎంపైర్ ను అడగగా అది సరైన గుర్తింపుగా అందరి మనల్ని పొందారు. అలాంటి గొప్ప క్రీడాకారుడు భారతదేశానికి ఎంతో పేరు తెచ్చి పెట్టడం జరిగిందని మూన్ లైట్ లో హాకీ నేర్చుకున్నాడని అలాంటి గొప్ప వ్యక్తిని మరవకుండా ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం అనేది గొప్ప విషయమని సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమేష్, బత్తుల అమర్, జే చంద్రయ్య ,వంగూరు వెంకటేశ్వర్లు, రాజకుమార్ రెడ్డి ,ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి భాస్కర్, పిజే శాంసన్, సందీప్, ఎస్టిహీరో చందు, కరాటే మాస్టర్ శ్రీను, డాన్స్ మాస్టర్ జగన్, గోపాల్, క్రాంతి ,వినోద్, రామకృష్ణ, మల్లికార్జున్, రమేష్, సన్నీ, సమీర్, ఆబిద్, పి ఈ టి లు తస్లీమ్, రంగా, శివ, జయ, విజయలక్ష్మి, రామ్ చరణ్, తేజస్విని, రవి, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు మెట్టిల్డ స్కూల్ విద్యార్థులు ఎస్వీఆర్ స్కూల్ విద్యార్థులు రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు జెడ్పి బాయ్స్ స్కూల్ విద్యార్థులు విద్యార్థి విద్యార్థినీలు క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి ధన్యవాదాలు తెలియజేసినారు అలాగే ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.