ఇదే నిజం, ధర్మారం: ధర్మారం మండలంలోని శాయంపేట ప్రాథమిక పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాల, వేసి, ఉపాధ్యాయ దినోత్సవం గురించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి నరిగె ప్రమీల గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వేడుకల్లో పాల్గొని ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్ గారిని,అంగన్వాడీ టీచర్ బద్దం భాగ్యలక్ష్మి గారిని పూలబొకేలిచ్చి, శాలువాల తో ఘనంగా సన్మానించారు. నిజానికి ఈ కార్యక్రమానికి ఎవరిని ప్రత్యేకంగా పిలువకపోయినా పాఠశాలపై మరియు ఉపాధ్యాయులపై ఉన్న గౌరవంతో వారే సమన్వయ పరుచుకుని శాలువాలు, పూలబొకేలు తీసుకొని పాఠశాలకు విచ్చేసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం, ఉపాధ్యాయులు పాఠశాల కోసం చాలా కష్టపడుతూ చాలా బాగా బోధిస్తున్నారని వారి సేవలను కొనియాడడం నిజంగా ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికినట్లు అనిపించింది. విద్యార్థుల కొరకు కష్టపడితే తల్లిదండ్రులు తప్పకుండా గుర్తిస్తారని సంతోషం అనిపించింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్, AAPC చైర్ పర్సన్ నరిగే ప్రమీల, కమిటీ సభ్యులు అనూష, లత, రజిత, నిరోష, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.