ఇదేనిజం, శేరిలింగంపల్లి: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శేరిలింగంపల్లి నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ , సరస్వతీమాత చిత్రపటాలకు జ్యోతి ప్రదీపనము చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య వై రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠము, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి శేరిలింగంపల్లి మండల పరిధిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, జవహర్ నవోదయ, గురుకుల బాలుర,బాలికల కళాశాలలు, రాయదుర్గ్, కొత్తగూడ, శేరిలింగంపల్లి, మియాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్స్ కాంప్లెక్స్ ల పరిధిలో గల 35 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం సామాజికవేత్త తూనిక రాఘవేంద్రరావు సౌజన్యంతో నిర్వహించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్యామల మాట్లాడుతూ “ఈ సమాజంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా గౌరవింపబడే వృత్తి అధ్యాపక వృత్తని అన్నారు. ” వేద కాలం నుండి మాతా పితరుల తరువాత గురువుకు పెద్ద పీఠం వేసింది ఈ సమాజమన్నారు. విద్యార్థులను అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వాడే గురువన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రత్న ప్రభ,రాఘవేంద్రరావువివిధ పాఠశాలల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు ,ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫణికుమార్, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, జనార్ధన్, పాలం శ్రీను, నేమానివిశ్వశాంతి,వెంకటధర్మసాగర్ , విజయలక్ష్మి, త్రివేణి, మమతా , సత్యవాణి, వరలక్ష్మి, జీవి రావు, బాలన్న, ఎం యస్ నారాయణ పాల్గొన్నారు.