ఇదేనిజం, కంగ్టి: తను గజ్జె కట్టి ఆడితే చూడ్డానికి రెండు కళ్లు చాలవు తను నర్తిస్తుంటే నెమలే పురివిప్పి నాట్యం చేస్తుందా అన్నట్లుంటుంది.ఆ నాట్య మయూరి ఎవరో తెలుసుకోవాలని ఉందా..? ఆ చిన్నారి నాట్యమాయారి ఎవరో కాదు సంగారెడ్డి జిల్లా కంగ్టి గ్రామానికి చెందిన నివేదిత 12 ఏళ్లు గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతోంది.తల్లి శ్రీలత గృహిణి , తండ్రి రైల్వే ఉద్యోగి. ఉద్యోగారిత్య హైదరాబాద్ లోని చందానగర్ లో నివాసం ఉంటున్నారు. తలిదండ్రులకు కూచిపూడి పై మక్కువ ఉండడంతో అప్పుడు ఉన్న ఆర్థికపరిస్థులలో తాము సాధించలేక పోయిమని బాధపడకుండా తమ కలను కూతురు ద్వారా నేర్పించాలనే దృఢ సంకల్పాతో కూచిపూడి నాట్యం వైపుకు నడిపించారు. తలిదండ్రులకు కలను నెరవేర్చలనే కూతురు నివదిత యొక్క పట్టుదలతో నాట్యం వైపు ప్రేరేపించింది. దింతో చిన్న వయస్సులో నుంచే నాట్యం మక్కువతో తన 5వ ఏటా స్ధానిక భారత్ వేదా ఆర్ట్స్ అకాడమీ చేర్చారు. గురువులైన శ్రీనివాస్ ప్రసాద్ , గీత వద్ద నాట్యంలో ఓనమాలు దిద్దుకుని అన్న చందంగా అనతికాలంలోనే తమ అభిరుచితో కూచిపూడి పై నైపుణ్యం సాధించింది. అత్యంత చిన్నతనంలోనే నాట్యం చేయడం ఆరంభించి నివేదిత తన అభినయంతో ఐదేళ్లకే సభా ప్రవేశం చేసి నాట్యం చేసి మెప్పించి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 250కి పైగా నాట్యాలు చేశారు. కోవిడ్ కాలం 2020లో ఆన్లైన్లో తానా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా మోనో యాక్షన్ లో రాణి రుద్రమదేవి గా 5 నిమిషాలు అభినయంతో పాటు డైలాగ్స్ చెప్పడంతో దాదాపు 40 దేశాల నుండి 680 నృత్య కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో విజేతగా నిలిచిన నివేదిత మొదటి బహుమతి సాధించింది. ఎంత క్లిష్టమైన భంగిమలో అయినా కొన్ని క్షణాలు పాటు ఉంటూ అభినయించడములో అందె వేసిన చేయి నివేదితది.
ఉన్నత ఆశయంతో సాధన…
నాట్య ప్రదర్శన, మోనో యాక్షన్ ఏ కాకుండా చదువును సమన్వయం చేసుకుంటు ఉదయం 5 గంటలకు మేల్కొని సాధన చేస్తు , మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య నాట్య శిక్షణ వెళ్తుంది. భవిష్యత్తు అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశించింది ఇచ్చి కూచిపూడి కి ప్రాధాన్యం కల్పించాలని ఆశయంతో సాధన చేస్తుంది.
అవార్డులె ఆభరణాలుగా..
నివేదిత ప్రస్తుతం గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతూ కూచిపూడి పై తనకున్న ఇష్టంతో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో నృత్యం , మోనో యాక్షన్ లో ఏకకాలంలో రాణిస్తుంది. నృత్య కళా బాల ప్రతిభ మహోత్సవ్ , భారత రంగస్థలం అకాడమీ , అఖిల నటరాజన్ , అంతర సంస్కృతిక సంస్థాన్ , భారతీయ నృత్య కళా సమ్మేళన్ , సంస్కార భారతి , రాష్ట్రీయ కళా మహోత్సవ్ పలు అకాడమీలు నిర్వహించిన పోటీల్లో తనదైన అభినయంతో ప్రతిభ చాటుతూ అలరిస్తూ బహుమతులు జ్ఞాపికలు అందుకుంది.
అవార్డుల పర్వం..
- 2019 లో కల రూప్య రత్న , 2020 లో మోనో యాక్షన్ ప్రపంచవిజేత
- 2021 లో కల కుసుమం , 2022 లో ప్రౌడ్ ఐకాన్ గా
- 2023 లో ఐసిఎండిఏ నుండి 10 వరల్డ్ రికార్డ్స్
- 2024 లో మహానంది జాతీయ పురస్కారం అదేవిధంగా బాల కళాశ్రీ నృత్య పురస్కారం