Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె డైరెక్టర్ సుందర్ సి తో గొడవ పడింది. నయనతార ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ”మూకుతి అమ్మన్ 2” అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ గత వారం చెన్నైలో ప్రారంభమైంది.ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో నయనతార, అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య గొడవ జరిగింది. నయనతార అసిస్టెంట్ డైరెక్టర్ ని స్వయంగా తిట్టింది. ఇది విన్న సుందర్ సి నయనతార ప్రవర్తనపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆ చిన్న గొడవ పెద్ద వివాదంగా మారడంతో దర్శకుడు సుందర్ సి షూటింగ్‌ని ఆపేసారు. ఈ క్రమంలోనే సుందర్ సి నయనతారను సినిమా నుండి తొలగించి, ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నాడు అని సమాచారం. ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత ఇషారి గణేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని నయనతారతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కానీ సుందర్ సి మాత్రం నయనతార విషయంలో చాలా హర్ట్ అయ్యాడని సమాచారం. అయితే నయనతార ఈ సినిమాలో నటిస్తుందా లేదా తమన్నా కొత్త నటి అవుతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇటీవల ధనుష్ తోనూ, ఇప్పుడు సుందర్ సి తోనూ ఆమెకున్న విభేదాలతో నయనతార ఇమేజ్ డామేజ్ అవుతుంది.